- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమాజ శ్రేయస్సు కోరే దాతలు ముందుకు రావాలి
దిశ ,శ్రీరంగపూర్ : సమాజశ్రేయస్సు కొరకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి నియోజకవర్గంలో మండల పరిధిలోని షేర్ పల్లి గ్రామస్తులు నాగరాజు తన సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన..తాగునీటి శుద్ధజల కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే తూడిమేఘారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ..గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వానికి తోడుగా దాతలు ముందుకురావడం హర్షనీయం అన్నారు. అదనపు గదుల నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని కాంట్రాక్టర్,విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్ లకు శ్రీకారం చుట్టిందన్నారు. పాఠశాల విద్యార్థులకు దుస్తుల తయారీ,ఉచిత ఆర్టీసీ బస్సులు ప్రయాణం,వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాల భాగస్వామ్యం చేయడం ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే విధంగా కాంగ్రెస్ సర్కారు ముందుకెల్తోందన్నారు. పాఠశాలలో మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నాగరాజును ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు భారతి, ఎంపీడీవో రవి నారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు,మండల నాయకులు శ్రీహరి రాజు,బీరం రాజశేఖర్ రెడ్డి గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.