ఇన్‌ఛార్జీలతో ఇబ్బందులు..అందుబాటులో ఉండని అధికారులు

by Aamani |
ఇన్‌ఛార్జీలతో ఇబ్బందులు..అందుబాటులో ఉండని అధికారులు
X

దిశ,మాగనూర్ : మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇన్చార్జిల పాలనతో మండల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఉండే రెండు పోస్టుల ఎంపీడీవో, ఎంపీ ఓ అధికారులు ఇన్చార్జులు కావడంతో ఇట్లు ప్రజలు, అట్లు కిందిస్థాయి అధికారులకు పాలన ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాకాలం కావడంతో గ్రామాల్లో ప్రధానంగా పారిశుధ్యం సమస్య ఉందని, దోమల వ్యాప్తి తో డెంగు, మలేరియా వ్యాధులు వ్యాపించి ఆస్పత్రులకు పరుగు తీస్తున్న పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఒక వైపు గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీల పాలన కాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను గ్రామాలకు ప్రభుత్వం నియమించింది. అయితే వారు ఒక్క రోజు కూడా గ్రామాల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో కొందరు పంచాయతీ కార్యదర్శులు కూడా ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మండలం వైపు చూడాలని మండలానికి రెగ్యులర్ ఎంపీడీవో తో పాటుగా ఎంపీఓలను నియమించి మండలంలోని పాలనను గాడిలో పెట్టాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed