- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ap News:దీపావళి కోసం ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు:జిల్లా కలెక్టర్
దిశ, ఏలూరు సిటీ: దీపావళి పండుగ సందర్భంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏలూరు కలెక్టరేట్ లో 9491041428 నెంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఈ అత్యవసర కంట్రోల్ రూమ్ ఈనెల 31వ తేదీ వరకు పనిచేస్తుందన్నారు. ఎక్కడైనా, ఏదైనా ప్రమాధాలు సంభవిస్తే కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలన్నారు. సంబంధిత సిబ్బంది ఆ సమాచారాన్ని ఆయా తహశీల్దార్లకు వెంటనే తెలియజేయాలన్నారు. దీపావళి పండుగ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండి అత్యవసర కేసుల పై తక్షణమే స్పందించాలన్నారు. బాణాసంచా సామగ్రి విక్రయించే దుకాణాల వద్ద అవసరమైన అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. దుకాణాలు నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసింది లేనిది ఆర్డిఓలు నిర్ధారించు కోవాలన్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పారిశుధ్యం, పరిశుభ్రత విషయాలపై సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.