International News : హిజ్బొల్లా కొత్త చీఫ్ తొలి స్పీచ్

by M.Rajitha |
International News : హిజ్బొల్లా కొత్త చీఫ్ తొలి స్పీచ్
X

దిశ, వెబ్ డెస్క్ : హిజ్బొల్లా(Hezbollah) కొత్త చీఫ్ గా షేక్ నయీం ఖాసిం(Naim Qassem) నియామకం అయ్యారు. నూతన బాధ్యతలు స్వీకరించిన షేక్ నయీం తొలి ప్రసంగం చేశారు. ఇజ్రాయెల్ పై చేసే యుద్దంలో నస్రల్లా రూపొందించిన వ్యూహానికి కట్టుబడి ఉంటామని వెల్లడించారు. ఇటీవల హిజ్బొల్లా చీఫ్ హాసన్ నస్రల్లా(Hasan Nasrallah)ను ఐడీఎఫ్ అంతమొందించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హిజ్బొల్లాకు కొత్త చీఫ్ గా షేక్ నయీం ఖాసింను ఎన్నుకున్నారు. కాగా షేక్ నయీం ఖాసిం నియామకంపై ఇజ్రాయెల్ మండిపడింది. ఈ చీఫ్ ఎన్నోరోజులు ఉండబోరని పరోక్షంగా హెచ్చరించింది.

Advertisement

Next Story