Land dispute: భూ వివాదంలో బాలుడి తల నరికిన ప్రత్యర్థులు.. యూపీలో ఘోరం

by vinod kumar |
Land dispute: భూ వివాదంలో బాలుడి తల నరికిన ప్రత్యర్థులు.. యూపీలో ఘోరం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌ (Utharapradesh)లో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య జరిగిన భూ వివాదంలో ప్రత్యర్థులు ఓ బాలుడి తల నరికి చంపారు. రాష్ట్రంలోని జౌన్ పూర్ (Jaunpur) జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కబ్రూద్ధీన్ పూర్ (kabruddinpur) గ్రామంలో గత నలబై ఏళ్లుగా రెండు కుటుంబాల మధ్య భూ వివాదం నడుస్తోంది. ప్రస్తుతం ఈ కేసు జిల్లా కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇదే విషయమై ఇరు వర్గాల మధ్య మరోసారి తాజాగా ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో ఒక వర్గానికి చెందిన లాల్తా యాదవ్ (Lalthaa Yadav) అనే వ్యక్తి మరో వర్గానికి చెందిన బాలుడు అనురాగ్ యాదవ్ అలియాస్ చోటు (17)పై బుధవారం ఉదయం తన ఇంటి వద్ద పండ్లు తోముకుంటుండగా కత్తితో దాడి చేసి.. అతని తలను నరికేశాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన తర్వాత నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. నిందితుడి తండ్రి రమేష్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. లల్తా యాదవ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై మెజిస్టీరియల్ విచారణకు సైతం ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed