- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నల్లమలలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం
దిశ, అచ్చంపేట: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్, ప్రణాళిక మరియు విద్యుత్ శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావుకు అధికారిక హోదా లో మొదటిసారిగా నల్లమల్లకు సోమవారం వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున నల్లమల్ల ముఖద్వారమైన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు మెగా రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా అటవీశాఖ, ఐటీడీఏ ఇన్చార్జి పి ఓ రోహిత్ గోపి డి, ఆర్డిఓ మాధవి, తదితరులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. మన్ననూర్ గ్రామా శివారులో శ్రీశైలం జాతీయ రహదారి వెంట అటవీశాఖ వనమాలిక వద్ద ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం అక్కడే అల్పాహారం చేసి శ్రీశైలం మల్లికార్జున దైవ దర్శనం కోసం వెళ్లారు. మంత్రి రాక సందర్భంగా నల్లమల్లలో జిల్లా ఎస్పీ గైక్వాడ్ ఆధ్వర్యంలో అడవి మార్గంలో జాతీయ రహదారి వెంట పాతాళ గంగ వరకు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. షెడ్యూల్డ్ ప్రకారం ఉప ముఖ్యమంత్రి మూడు గంటలు ఆలస్యంగా రావడంతో అధికారులు నాయకులు నిరీక్షణ చేయాల్సి వచ్చింది.