- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jurala Gates : జూరాలకు కొనసాగుతున్న వరద..
దిశ, గద్వాల : ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వస్తున్న వరద ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం రాత్రి నాటికి జూరాల జలాశయంలో 318.080 మీటర్ల స్థాయిలో 8.770 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకోగ ఎగువ ప్రాంతం నుంచి 2.65 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 36 గేట్లను తెరిచి గేట్ల ద్వారా 2,47,208 క్యూసెక్కులను శ్రీశైలం జలాశయంకు వదులుతున్నారు. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తికి 22,740, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 750, భీమా లిఫ్ట్-1కు 650, కోయిల్‌సాగర్‌కు 315, సమాంత కాలువకు 850, జూరాల కుడి, ఎడమ కాలువలకు 1,524 క్యూసెక్కుల చొప్పున మొత్తం జూరాల నుంచి 2,73,925 క్యూసెక్కులను వదులుతున్నట్లు జూరాల వరద నియంత్రణ కార్యాలయం అధికారులు తెలిపారు.
అదే విధంగా నారాయణపూర్ జలాశయంలో 490.96 మీటర్లు,27.688 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 2లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో నారాయణపూర్ ప్రాజెక్టు 25 గేట్లను తెరిచి దిగువ జూరాల వైపు 1.89లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. ఆల్మట్టి జలాశయంలో 80.953 టీఎంసీల నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి ఆల్మట్టికి 2,91,028 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 2లక్షల క్యూసెక్కులను వదులుతున్నట్లు జూరాల అధికారులు తెలిపారు.