కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గిరిజనులను ఆదుకుంటాం: సిజే రావు

by S Gopi |
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గిరిజనులను ఆదుకుంటాం: సిజే రావు
X

దిశ, వీపనగండ్ల: రాష్ట్రంలో దళిత గిరిజనులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించకుండా ప్రభుత్వం విస్మరించిందని లంబాడి తండాలపై ఎక్సైజ్ దాడులు చేయిస్తూ అక్రమంగా కేసులు బనాయిస్తూ అమాయక గిరిజనులను జైలుకు పంపుతున్నారని తెలంగాణ పీసీసీ సభ్యులు చింతలపల్లి జగదీశ్వర్ రావు విమర్శించారు. హాథ్ సే హాథ్ జోడయాత్రలో భాగంగా వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం నాగర్లబండ తండా, సంపత్ రావుపల్లి గ్రామాలలో పర్యటించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా జగదీశ్వరరావు మాట్లాడుతూ తండాలలో గిరిజనుల బ్రతుకులు ఆగమ్యగోచరంగా ఉన్నాయని గిరిజనులకు మూడెకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అంటూ ప్రభుత్వం మభ్య పెట్టడమే కానీ అమలు చేయలేదని అన్నారు. తండాలో నాటు సారవిక్రయాలు లేకున్నా ప్రభుత్వం ఎక్సైజ్ దాడులు చేయిస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ అమాయక గిరిజనులను జైలుకు పంపడం ఏమిటని ప్రశ్నించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పలు తండాలలో గిరిజనులు బతకడం కష్టంగా మారిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గిరిజనులను ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ హనుమంతు నాయక్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story