రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

by Mahesh |
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
X

దిశ, దేవరకద్ర: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామం వద్ద ఊక చెట్టు వాగులో 12 కోట్ల 50 లక్షల రూపాయలతో, నెల్లికొండి ముచ్చింతల గ్రామాల మధ్య 15 కోట్ల 29 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన చెక్ డ్యాములను అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఊక చెట్టు వాగు పై రెండు చెక్ డ్యాములు శాస్త్రీయంగా నిర్మించడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అందులో భాగంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతన్నలకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామని తెలిపారు. గతంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ విడతల వారీగా రుణమాఫీ చేయడంతో అవి వడ్డీకే సరిపోయాయని బిఆర్ఎస్ పార్టీ మోసపూరిత వైఖరి పై మండిపడ్డారు.

సాంకేతిక కారణాలతో రుణమాఫీ కానీ రైతులకు త్వరలోనే రుణమాఫీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ లన్నిటిని నెరవేరుస్తామని తెలిపారు. అనంతరం నాయకులతో కలిసి చెక్ డ్యామ్ దగ్గర పడవలో సరదాగా ప్రయాణించారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండా అరవింద్ కుమార్ రెడ్డి ,కౌకుంట్ల మండల అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి, దేవరకద్ర కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంజల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి లక్ష్మీకాంత్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు ,ఆది హనుమంత్ రెడ్డి, కోన రాజశేఖర్ కురువ రాంపండు, కిషన్ రావు, నరసింహారెడ్డి, నర్వ శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ ,రఘు,ఇరిగేషన్ అధికారులు చందు నాయక్, కౌకుంట్ల మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed