Runa Mafi: రుణమాఫీ కానీ రైతులకు శుభవార్త..త్వరలోనే అకౌంట్లలోకి డబ్బులు

by Maddikunta Saikiran |
Runa Mafi: రుణమాఫీ కానీ రైతులకు శుభవార్త..త్వరలోనే అకౌంట్లలోకి డబ్బులు
X

దిశ, వెబ్‌డెస్క్:కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఎన్నికల హామీల్లో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ(Loan Wavier) ప్రధానమైనది. తెలంగాణా(TG)లో తాము అధికారంలోకి రాగానే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసింది. మెుత్తం మూడు విడతల్లో రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అయితే ఆధార్,బ్యాంక్ అకౌంట్లలలో పేర్లు తప్పు కారణంగా కొంత మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఈ క్రమంలో రుణమాఫీ కానీ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.మూడు విడతల్లో కూడా రుణమాఫీ కానీ రైతుల వివరాలను గ్రామాల వారీగా వ్యవసాయశాఖ అధికారులు సేకరించారు .రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేక రుణమాఫీ కానీ రైతులు 4 లక్షల మందికి పైగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

అలాగే ఆధార్ కార్డులు, బ్యాంకు పాస్‌బుక్‌లలో పేర్లలో తప్పుల కారణంగా మాఫీకాని అన్నదాతలు మరో లక్ష 20 వేలకు పైగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో త్వరలోనే రేషన్ కార్డు లేని, ఆధార్ తప్పుల కారణంగా మాఫీ కానీ రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. ఇప్పటికే అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రైతుల అకౌంట్లలో డబ్బులు జమకానున్నాయి.మొత్తం 5 వేల కోట్లను రైతుల ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేయనుంది.దీంతో ఆధార్ తప్పులు, రేషన్ కార్డులేని దాదాపు 5 లక్షల అన్నదాతల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

Advertisement

Next Story

Most Viewed