శ్రీ చైతన్య కాలేజీని సందర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్

by Mahesh |
శ్రీ చైతన్య కాలేజీని సందర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్
X

దిశ, శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శ్రీచైతన్య గర్ల్స్ క్యాంపస్‌లో విద్యార్థినిలకు ఫుడ్ పాయిజన్ ఇష్యూ సీరియస్‌గా మారుతోంది. ఇప్పటికే ఈ ఇష్యూపై విద్యార్థి సంఘాలు సీరియస్‌గా ఉండగా.. తాజాగా ఈ ఇష్యూలోకి రాష్ట్ర మహిళా కమిషన్ ఎంటర్ అయింది. మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలోని అక్షయ క్యాంపస్ విద్యార్థులు అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారికి ఫుడ్ పాయిజన్ అవగా కనీసం తల్లిదండ్రులకు కూడా విషయం తెలియకుండా దాస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. శుక్రవారం విద్యార్థి సంఘాల ఆందోళన ప్రశాంతంగా సాగగా, శనివారం నాడు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి సంఘాల ప్రతినిధులపై శ్రీ చైతన్య సిబ్బంది దాడికి దిగారు. దీంతో మాదాపూర్ పోలీసులు జోక్యం చేసుకుని పలువురిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సోమవారం మరోసారి విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. వారు రంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకయ్య నాయక్ మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీని సందర్శించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.

శ్రీ చైతన్య కాలేజీకి మహిళా కమిషన్ చైర్మన్

శ్రీ చైతన్య కాలేజీ ఘటనను సీరియస్ గా తీసుకుంది రాష్ట్ర మహిళా కమిషన్. సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నెరేళ్ల శారద ఆకస్మిక తనిఖీ చేశారు. కాలేజీ ప్రాంగణం, విద్యార్థినిల హాస్టల్, మెస్ లను తనిఖీ చేసి నాసిరకమైన ఫుడ్ వడ్డించడం తో పాటు హాస్టల్‌లలో సౌకర్యాలు సరిగా లేవని గుర్తించారు. కాలేజీ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. అదే విధంగా అక్కడి విద్యార్థిలతో కాసేపు మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పిల్లల భద్రత పైన రాజీపడబోమని, విద్యార్థులకు ఇబ్బందులు ఎదురైతే ఎవ్వర్ని ఉపేక్షించేది లేదని మహిళా కమిషన్ చైర్మన్ నెరేళ్ల శారద హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed