ఖరీఫ్ సీజన్ లోనూ పీక్ విద్యుత్ డిమాండ్ : ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ

by M.Rajitha |
ఖరీఫ్ సీజన్ లోనూ పీక్ విద్యుత్ డిమాండ్ : ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదవుతోందని, ఈనేపథ్యంలో జిల్లాల ఆపరేషన్ విభాగం అధికారులు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు. సంస్థకు చెందిన సూపరింటెండింగ్ ఇంజినీర్లు, చీఫ్ ఇంజినీర్లతో సోమవారం సీఎండీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఈసారి అత్యధికంగా రికార్డు స్థాయిలో వరి సాగు జరుగుతోందని, అందుకే విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతోందన్నారు. గత రబీ సీజన్ లో నమోదైన స్థాయిలో ఖరీఫ్ సీజన్ లో విద్యుత్ డిమాండ్ నమోదవుతోందని వివరించారు. సంస్థ పరిధిలో గతేడాది ఖరీఫ్ సీజన్ లో గరిష్ట డిమాండ్ 9862 మెగావాట్లు కాగా, ఈ సారి 9910 మెగావాట్లకు చేరిందని ఆయన పేర్కొన్నారు. ఈ సీజన్ ముగిసే నాటికి గరిష్ట డిమాండ్ 10000 మెగా వాట్లకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని, వినియోగం సైతం 200 మిలియన్ యూనిట్లకు మించే అవకాశం ఉందని వివరించారు. తెలంగాణలో గతేడాది ఖరీఫ్ సీజన్ లో అత్యధిక డిమాండ్ 15370 మెగా వాట్లు కాగా ఈ ఏడాది సెప్టెంబర్ 20 న 15570 మెగావాట్లుగా నమోదైనట్లుగా చెప్పారు. ఈ సీజన్ ముగిసే నాటికి డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో, ఫీడర్ల పై, పవర్ ట్రాన్స్ ఫార్మర్లపై ఎలాంటి ఓవర్ లోడ్ సమస్యలు లేకుండా ఎప్పటికప్పడు లోడ్ ను చెక్ చేసుకుంటూ, రైతాంగానికి ఎలాంటి సరఫరా సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed