వయోవృద్ధులకు గౌరవమే ప్రధానం!

by Ravi |
వయోవృద్ధులకు గౌరవమే ప్రధానం!
X

వృద్ధాప్యం మరో బాల్యం అని అంటారు. పండుటాకులు చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అయితే వారి వద్ద ఎంతో అనుభవం ఉంటుంది. అది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే సమాజానికి విలువైన వనరు అని అంటారు. వారికి గౌరవమే ప్రధానం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల హక్కులను పరిరక్షించే విధానాలను ప్రచారం చేయడానికి, వయో-సంబంధిత వివక్షను తొలగించడానికి తరాల పరస్పర సహకారానికి మద్దతు ఇవ్వడానికి కమ్యూనిటీలు, ప్రభుత్వాలు సంస్థలను కలిసి రావాలని ఐక్యరాజ్య సమితి ప్రోత్సహిస్తుంది. 2024 థీమ్ ‘గౌరవంతో వృద్ధాప్యం’ అనే థీమ్‌ను తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంరక్షణ, సహాయ వ్యవస్థలను బలోపేతం చేయడం ప్రాముఖ్యతను వివరించనున్నారు.

వారి అనుభవాల కోసమైనా..

మారిన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో గతంలో కంటే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్న నేపథ్యం లో వారు ఒంటరిగా మిగిలిపోతున్నారు. వారికి సహాయం, కుటుంబ సభ్యుల సాంగత్యం అవసరం అవుతోంది. వారితో గడిపి వారి అనుభవాలను వింటుంటే ఎంతో విజ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. భారతదేశంలోని వృద్ధుల జనాభా దశాబ్ద వృద్ధిరేటు ప్రస్తుతం 41శాతంగా అంచనా వేశారు. వీరి జనాభా శాతం 2050 నాటికి జనాభాలో 20శాతం కంటే రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం, 2046 నాటికి దేశంలోని పిల్లల జనాభాను వృద్ధుల జనాభా మించిపోయే అవకాశం ఉందని పేర్కొంది. వీరిని కాపాడుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛన్ అందజేస్తున్నారు. అయితే, వీటితో పాటు వయోవృద్ధుల ఆశ్రమాన్ని, డే కేర్ సెంటర్లను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మరిన్ని సత్ఫలితాలు లభిస్తాయి. అలాగే వారి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను తెలుగు రాష్ట్రాలలో కూడా అమలుపరచాలి.

డాక్టర్ బాబు నంబూరు

ఫ్యాకల్టీ, డిపార్ట్​మెంట్ ఆఫ్ ఎకనామిక్స్

83411 94551

Advertisement

Next Story

Most Viewed