Modi 3.0 : మోడీ 3.0 తొలి 100 రోజుల పాలనపై విదేశాంగ శాఖ నివేదిక

by Hajipasha |
Modi 3.0 : మోడీ 3.0 తొలి 100 రోజుల పాలనపై విదేశాంగ శాఖ నివేదిక
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీ మూడోవిడత పాలనా కాలపు తొలి 100 రోజుల్లో ప్రపంచ దేశాలతో సంబంధాల బలోపేతానికే అత్యంత ప్రాధాన్యమిచ్చారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలతో ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం.. గత వంద రోజుల వ్యవధిలో భారత్ అల్బానియా, గాబన్, జార్జియా, తైమూర్ లెస్టేలలో కొత్తగా దౌత్య కార్యాలయాలను తెరిచింది.

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్, స్పెయిన్‌లోని బార్సిలోనాలోనూ అదనంగా చెరొక దౌత్య కార్యాలయాన్ని భారత్ ఏర్పాటు చేసింది. సముద్రంలో పెట్రోలింగ్ అవసరాలకు వినియోగించే పీఎస్ జొరోస్టర్ నౌకను సీషెల్స్ దేశానికి భారత్ అందించింది. నౌకాదళ భద్రతతో ముడిపడిన అంశాలపై ఆస్ట్రేలియా, వియత్నాం దేశాలతోనూ భారత్ ముమ్మర చర్చలు జరిపింది.

Advertisement

Next Story

Most Viewed