SEBI: బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న సెబీ

by S Gopi |
SEBI: బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న సెబీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సోమవారం బోర్డు సమావేశాన్ని నిర్వహించింది. సెబీ చైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్‌పై యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు లేవనెత్తిన తర్వాత మొదటిసారి ఈ సమావేశం జరిగింది. అయితే సమావేశంలో డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో పెరుగుతున్న లావాదేవీలను నియంత్రించేందుకు సెబీ ఎలాంటి చర్యలను ప్రకటించలేదు. చాలామంది మదుపర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్అండ్ఓ) మార్కెట్‌కు సంబంధించి ఏవైనా చర్యలను ఆశించారు. సమావేశంలో తీసుకున్న ఇతర అంశాల్లో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు సంబంధించి ఎంఎఫ్ లైట్ ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకొచ్చేందుకు ఆమోదించింది. అలాగే, అధిక నికర విలువైన పెట్టుబడిదారులను రిస్క్‌తో కూడిన సాధనాల్లో పెట్టుబడులకు అనుమతించే కొత్త అసెట్ క్లాస్‌కు ఆమోదించింది. రైట్స్ ఇష్యూ ప్రక్రియను పూర్తి చేసేందుకు సమయాన్ని తగ్గించడం, టీ+0 సెటిల్‌మెంట్ కోసం టాప్ 25 నుంచి 500 లిస్టెడ్ కంపెనీలను పెంచనున్నారు. రీసెర్చ్ అనలిస్టులు, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ కోసం నిబంధనల సడలింపు, సెకండరీ మార్కెట్‌లో ట్రేడింగ్ కోసం పెట్టుబడిదారులకు అవకాశాలు కల్పించడం సహా పలు కీలక నిర్ణయాలను సెబీ సమావేశంలో తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed