- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Rain Alert: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
దిశ, వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్(AP)లోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(Disaster Management Authority) తెలిపింది. బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడన(Low Pressure) ప్రభావంతో సోమవారం నుంచి శ్రీకాకుళం, VZM, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
అలాగే కోనసీమ, తూర్పుగోదావరి , పచ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, ATP, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్(Ronanki Kurmanath) తెలిపారు.ఈ నేపథ్యంలో రైతులు, కూలీలు, పశువుల కాపర్లు జాగ్రత్తలు తీసుకోవాలని ,సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.