తెలంగాణ పథకాలను భారత ప్రధాని కాపీ కొడుతున్నారు.. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

by Sumithra |
తెలంగాణ పథకాలను భారత ప్రధాని కాపీ కొడుతున్నారు.. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
X

దిశ, కోస్గి : భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం మాడల్ గా వ్యవహరిస్తుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోస్గి పట్టణంలోని మేకల రాజేష్ ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం జూన్ 2వ తేదీతో రాష్ట్రం ఏర్పడి పదిసంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీఎం కేసీఆర్ శతజయంతి ఉత్సవాలను జరుపుకోవాలని ఆదేశం ప్రకారం జూన్ రెండవ తేదీ నుంచి ప్రతి మండలాలలో పండగ వాతావరణం 21 రోజులపాటు నెలకొంటుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నపథకాలు ఇతర రాష్ట్రాలలో లేవన్నారు భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం మాడల్ గా వ్యవహరిస్తుందన్నారు.

మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పథకాలను ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్నారన్నారు. భారత రాష్ట్ర ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పథకాలని కాపీ కొడుతున్నారన్నారు. అదేవిధంగా వ్యవసాయ రైతులకు 24 గంటలు కరెంటు, పెట్టుబడి సహాయం కింద రెండు పంటలకు పదివేల రూపాయలు, పండించిన పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుక్కోవడం, రైతుల దగ్గర వడ్లను కొనుగోలు చేసి పదిరోజుల్లో వారి అకౌంట్లో అమౌంట్ జమచేస్తామన్నారు. రైతువేదిక, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల అభివృద్ధి చేయడంతో రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా కొడంగల్ ఎమ్మెల్యేగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఏ ఒక్క గ్రామం తండాకు చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు.

రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేయడం చంద్రబాబుతో కలిసి దొంగ కంపెనీలు పెట్టి కోట్లు సంపాదించి పీసీసీ పదవిని కొనుగోలు చేశారన్నారు. కొడంగల్ నియోజవర్గానికి రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. అభివృద్ధి పై చర్చకు తాము సిద్ధమేనని రెండుసార్లు చాలెంజ్ విసిరిన రేవంత్ రెడ్డి స్వీకరించలేదన్నారు. నాపై పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. కోస్గి మండలంలో పనిచేస్తున్న జర్నలిస్టులు అందరికీ సొంత ఇల్లు స్థలాలను కేటాయిస్తామని హామీఇచ్చారు. ప్రభుత్వ భూములను గుర్తించి జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని స్థానిక నాయకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శాసన రామకృష్ణ, ప్రకాష్ రెడ్డి, మేకల రాజేష్, మధుకర్ రావు, భీమ్ రెడ్డి, వేణుగోపాల్, వెంకట నరసింహులు, బాలేష్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed