- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మేము అధికారంలోకి వస్తే గొర్రెలు కాదు ఉద్యోగాలు ఇస్తాం'
దిశ, హన్వాడ: గత పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తూనే వస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులైన కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం గుర్తించలేదని. 1200 మంది ఉద్యమకారులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలను గౌరవించలేదని మిథున్ రెడ్డి మండిపడ్డారు. హన్వాడ మండలంలోని తిరుమలగిరి, ఇబ్రహీంబాద్, ఫుల్పోనిపల్లి, నాయినోనిపల్లి గ్రామాల్లో మంగళవారం రోజు ఎన్నికల ప్రచారంలో భాజపా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి మిథున్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. భారాస నాయకులు ఎలక్షన్లు వచ్చాయని లిస్టులు తీసుకొచ్చి దళిత బంధు, బీసీ బంధు పలానా వాళ్లకు వచ్చాయని ఈ ప్రభుత్వానికి ఓటేస్తే మీక్కూడా ఈ పథకాలు వస్తాయని ప్రజలను బీఆర్ఎస్ నాయకులు మరోసారి మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ పథకాలు బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే లిస్టులో పేర్లు వచ్చాయని అసలైన నిరుపేదలకు, అర్హులైన వారికి ఈ పథకాలు రాలేదని మిథున్ రెడ్డి అన్నారు. మీరు ఎంతో కష్టపడి పిల్లలను పై చదువులు చదివించి ఉద్యోగం సాధిస్తారని ఉన్నత చదువులు చదివిస్తే కేసీఆర్ మాత్రం ఉద్యోగాలు వేయడం లేదని ఆయన అన్నారు. గ్రూప్స్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్2, గ్రూప్3, గ్రూప్4 అప్లికేషన్లతో రూ. 222 కోట్లు దండుకున్నారు. కానీ ఎగ్జామ్స్ పెట్టింది లేదు చేసింది లేదు అని మిథున్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ పేపర్ లీకేజీ అవడంతో ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. యాదవ సోదరులు అప్పుచేసి డీడీలు కడితే ఇప్పటివరకు గొర్రెలు ఇవ్వలేదని, యాదవ సోదరులకు ఒకటే చెప్తున్నాము మేము అధికారంలోకి వస్తే గొర్రెలు కాదు ఉద్యోగాలు ఇస్తామని ఆయన అన్నారు.
ఉద్యోగాలు వస్తే మీరు, మీ కుటుంబం, మీ గ్రామం బాగుంటుందని మిథున్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోడీ నాపై నమ్మకం ఉంచి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు సేవ చేస్తానన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన దౌర్జన్యాలు, కబ్జాలు, బెదిరింపులు చేస్తున్నారు. మీకు అండగా నేను ఉంటాను. మీకోసం ఎక్కడికైనా వస్తాను. డబ్బు మద్యం కోసం ఆశపడి ఐదు సంవత్సరాల జీవితాన్ని వారికి రాశి ఇవ్వకండని ఆయన ప్రజలను కోరారు. కమలం పువ్వుకు ఓటేసి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మిథున్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More..