MLA : ప్రజల చెంతకు మెరుగైన వైద్య సేవలు

by Kalyani |   ( Updated:2024-10-04 12:54:51.0  )
MLA : ప్రజల చెంతకు మెరుగైన వైద్య సేవలు
X

దిశ, అచ్చంపేట: అచ్చంపేట ప్రజల చెంతకు మెరుగైన వైద్య సేవలు కల్పించడంలో భాగంగా వంద పడకల ఏరియా ఆసుపత్రిలో మౌలిక వసతుల కోసం ముమ్మరంగా కృషి జరుగుతుందని, తొందరలోనే అన్ని సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం లింగాల మండలంలోని అవసరం కుంట గ్రామంలో మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల ఫలాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీకి కార్యకర్తలు, నాయకులు వెన్నెముక లాంటి వారన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు, పదవులు తప్పకుండా ఉంటాయన్నారు. కార్యకర్తలు, నాయకులు పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల కృషి ఫలితంగానే ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గి బ్రహ్మరథం పడుతూ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని, అదేవిధంగా నన్ను ఎమ్మెల్యేగా చేశారని గుర్తు చేశారు.

ఈనెల 12న సీఎం కొండారెడ్డిపల్లి కి రాక..

సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన వంగూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామానికి ఈనెల 12న సాయంత్రం నాలుగు గంటలకు చేరుకుంటారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లపై కొండారెడ్డి పల్లి గ్రామంలో పరిశీలించి, హెలిప్యాడ్ కోసం తగిన సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మారుమూల గిరిజన ప్రాంతమైన లింగాల అభివృద్ధికి అధిక నిధులను మంజూరు చేసి అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ఏదో ఒక రూపంలో ప్రతి గడపకు అందుతున్నాయన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాస్ రావు, బెల్లంకొండ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed