- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ రోడ్డు పరిస్థితి మారదా..?
దిశ, దామరగిద్ద: మండలంలోని ఉల్లగుండం నుంచి నర్సాపూర్ వరకు 9 కిలో మీటర్ల రోడ్డు అడుగడుగునా గుంతల మయంగా మారింది. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. ఈ రోడ్డు కొంత రద్దీ అని చెప్పుకోవచ్చు... ఎందుకనగా కర్ణాటక నుంచి సేడం గుల్బర్గా యాదగిరి నుంచి పాలమూరుకు షార్ట్ కట్ రోడ్డు. ఇది ఎక్కువగా రద్దీగా ఉంటుంది. ప్రయాణం కష్టతరంగా మారింది. అత్యవసర సమయంలో ప్రయాణం చేయాలి అంటే చాలా కష్టంతో కూడుకుంటుంది. ఈ రోడ్డు చాలా గ్రామాలను అనుసంధానంగా ఉంది. దాదాపు 15 సంవత్సరాల క్రితం వేసిన బీటీ రోడ్డు ఇప్పుడు ఇది పూర్తిగా పాడైపోయింది. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలి అంటే సాహసోపేతమైన ప్రయాణమే అని చెప్పుకోవచ్చు. ఉల్లిగుండం, అన్న సాగర్, నర్సాపూర్, గ్రామ ప్రయాణికులకు మరింత కష్టతరం అయ్యింది. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే వాహనాలు పూర్తిగా దెబ్బ తింటున్నాయి. కాబట్టి చిన్న ప్రయాణానికి కూడా సమయం ఎక్కువగా తీసుకుంటుంది అని ఈ దారి వెంబడే ప్రయాణించి ప్రయాణికులు అంటున్నారు.