నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని వినూత్న నిరసన..

by Sumithra |
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని వినూత్న నిరసన..
X

దిశ, ఊట్కూర్ : నారాయణపేట - మక్తల్ - కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీటినీ అందించేందుకు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఊట్కూరు మండలం బిజ్వారం గ్రామానికి చెందిన ఓ రైతువినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు.

2014 మే 23న ఈ మూడు నియోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు అప్పటి ప్రభుత్వం మక్తల్ - నారాయణపేట - కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని జీవో విడుదల చేసింది. ఆ జీవోను అమలు చేయకపోవడం వల్ల సాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపిస్తూ ఆ రైతు ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎద్దు పై నారాయణపేట - కొడంగల్ చేపట్టాలని అక్షరాలతో రాసి నిరసన వ్యక్తం చేశాడు.

Advertisement

Next Story

Most Viewed