CM Revanth Reddy : మహిళా లోకానికి సీఎం క్షమాపణ చెప్పాలి.. బీఆర్ఎస్ నాయకులు

by Sumithra |
CM Revanth Reddy : మహిళా లోకానికి సీఎం క్షమాపణ చెప్పాలి.. బీఆర్ఎస్ నాయకులు
X

దిశ, నాగర్ కర్నూల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతల నుంచి దిష్టిబొమ్మను లాక్కున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరిగింది. అనంతరం వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ముఖ్య నేతలు మాట్లాడుతూ మహిళా లోకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బిజినపల్లి, తెలకపల్లి మండలంలో నిరసనలు..

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బిజినపల్లి తెలకపల్లి మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. మండల కేంద్రాల్లో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed