అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు: కలెక్టర్ కోయ శ్రీహర్ష

by Kalyani |
అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు: కలెక్టర్ కోయ శ్రీహర్ష
X

దిశ, ప్రతినిధి నారాయణపేట: రెవెన్యూ అధికారులు విధి నిర్వహణలో భాగంగా అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని కలెక్టర్ కోయ శ్రీహర్ష తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దారులకు సూచించారు. సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో తహసీల్దార్, నాయబ్ తహసిల్దార్ లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

కార్యాలయానికి సమయానికి చేరుకోవలన్నారు. కార్యాలయానికి ఏ సమయం లో వస్తున్నారు? ఎంత సమయం కార్యాలయం లో కేటాయిస్తున్నారు అనే విషయాలు ప్రతిదీ తన దృష్టికి వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. దళారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మీసేవా కేంద్ర నిర్వాహకులు అధిక డబ్బులను వసూలు చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో పీఎస్ నాగేంద్ర ప్రసాద్, సూపరింటెండెంట్ జగదీష్, బాలచందర్, తహశీల్దార్లు, డిప్యూటీ తాసిల్దార్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed