- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరమ్మత్తులకు నోచుకోని కరెంట్ స్తంభం
by Naveena |
X
దిశ, ఊట్కూర్ : స్తంభం విరిగి మూడు రోజులు గడుస్తున్న అధికారులు పట్టించుకోని ఘటన సమిస్తాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ప్రధాన రహదారిపై మూడు రోజుల క్రితం ఒక ప్రైవేటు వాహనం స్తంభాన్ని ఢీ కొట్టింది. స్తంభం ఒక్కసారిగా వోరిగి ఉండిపోయింది. దీంతో గ్రామస్తులు వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో స్తంభానికి ఉన్న తీగలు సెలవులలో ఇంటికి వచ్చిన చిన్నారులు, ప్రజలపై పడుతుందేమో అని ఆందోళన చెందుతున్నారు. వాహనానికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో..అక్కడి నుంచి డ్రైవర్ వాహనం తీసుకొని జారుకున్నాడు. సమస్య గురించి గ్రామస్తులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించిన పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. గ్రామంలో ఎటువంటి ప్రమాదాలు జరగకముందే కొత్త స్తంభాన్ని నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Next Story