- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Collector :సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను వేగవంతం చేయాలి
దిశ, కొత్తకోట: నవంబర్ 6 నుంచి చేపట్టబోయే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం ఎన్యుమరేషన్ బ్లాక్ ల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కొత్తకోట మండల పరిధిలోని వడ్డేవాట గ్రామం, కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోనీ 14 వ,వార్డ్ లో పర్యటించి ఎన్యుమరేషన్ బ్లాక్ ల గుర్తింపు ప్రక్రియను..ఈ సందర్భంగా పరిశీలన చేశారు. అనంతరం వడ్డేవాట గ్రామంలో ఎన్యుమేరేషన్ బ్లాక్స్ గుర్తించిన విధానాన్ని గ్రామ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. హౌస్ లిస్టింగ్ ఫారం ఏవిధంగా నింపుతున్నారని అడిగి తెలుసుకున్నారు. కొత్తకోట శివారులోని అచల గురు యోగ ఆశ్రమంలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో.. నిర్మించిన కామన్ హాల్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ రామ మహేశ్వర్, కొత్తకోట ఎమ్మార్వో వెంకటేశ్వర్లు, ఎంపిడివో చెన్నమ్మ, మునిసిపల్ కమిషనర్, క్షేత్ర స్థాయి సిబ్బంది, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.