- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వీధి కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లలు మృతి
by Naveena |
X
దిశ, మానోపాడు(అలంపూర్): మానోపాడు మండల పరిధిలోని జల్లాపురం గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహరం చేస్తున్నాయి. గుంపులుగా సంచరిస్తూ.. దాడులకు తెగబడుతున్నాయి. వీధి కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లలు మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. బాధితుడు గొల్ల రాముడు తెలిపిన వివరాల ప్రకారం..రోజులాగా పొలం పాకలో గొర్రెలను ఉంచాడు. 12 గంటల సమయంలో వీధీ కుక్కలు ఒక్కసారిగా మందపై దాడి చేశాయి. దీంతో 30 గొర్రెలు మృతి చెందగా.. మరో 10 గొర్రెలు తీవ్ర గాయపడ్డాయి. మృతి చెందిన గొర్రెల విలువ 2 లక్షల వరకు ఉంటుందని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. గ్రామంలో కుక్కల బెడద నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల కోరుతున్నారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని పలువురు కోరారు.
Advertisement
Next Story