- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Liquor Sales: సర్కార్‌కు కాసుల పంట.. ఒక్క నెలలో రూ.3,662 కోట్ల లిక్కర్ అమ్మకాలు
దిశ, తెలంగాణ బ్యూరో: నూతన సంవత్సరం వేడుకలు ఆబ్కారీ శాఖకు భారీ ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. సాధారణ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. వీకెండ్స్‌లో రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకూ ఉంటాయి. ఇక డిసెంబర్ నెల చివరి వారంలో మాత్రం మద్యం అమ్మకాలు రెట్టింపు అవుతున్నాయి. 2024 డిసెంబర్ 30వ తేదీ ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా రూ.402 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో 2,620 మద్యం షాపులుణ
రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం షాపులు, 1,117 బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్స్ ఉన్నాయి. 51 కంపెనీల ద్వారా 1,000 రకాల మద్యం ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి పొంది ఉన్నది. ఆయా ప్రాంతాలకు 19 డిపోల నుంచి బేవరెజ్ సంస్థ మద్యం సరఫరా చేస్తోంది. ప్రతి నెలా 40 లక్షల నుంచి 45 లక్షల కేసుల బీర్లు, 30 లక్షల నుంచి 35 లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరుగుతున్నాయి.
డిసెంబర్‌లో ఆబ్కారీ శాఖకు భారీ ఆదాయం
ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఆబ్కారీ శాఖకు భారీగా ఆదాయం సమకూరుతోంది. నూతన సంవత్సరం వేళ 2024 డిసెంబర్ 30వ తేదీన రూ.402 కోట్ల మద్యం అమ్మకాలు జరిగిట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇందులో 3,82,265 కేసుల లిక్కర్, 3,96,114 కేసుల బీర్ల అమ్మకాలు జరిగినట్లు ఆఫీసర్లు వెల్లడించారు. 31వ తేదీ సైతం రెట్టింపు స్థాయిలో అమ్మకాలు ఉంటాయని చెబుతున్నారు.
రూ.వెయ్యి కోట్ల మద్యం అమ్మకం దిశగా చర్యలు
డిసెంబర్ 30, 31వ తేదీ రెండు రోజుల్లో రూ.1,000 కోట్ల మద్యం అమ్మకాలే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 2022 డిసెంబర్‌లో రూ.3,100 కోట్లు, 2023లో 4,292 కోట్లు, 2024 డిసెంబర్ 30వ తేదీ వరకు రూ.3,662 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఆఫీసర్లు తెలిపారు.
విట్రో యాప్‌తో ప్రత్యేక నిఘా
మద్యం అమ్మకాలపై ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇతర రాష్ట్రాల మద్యం అమ్మకాలు జరగకుండా, కల్తీ మద్యం అమ్మకాలు చేపట్టకుండా విట్రో యాప్ ద్వారా ప్రత్యేక నిఘా ఉంచారు. దీని ద్వారా మద్యం బాటిల్‌పై ఉన్న క్యూర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ బాటిల్ ఏ రాష్ర్టానికి చెందినది, ఎక్కడ తయారు చేశారు ? వంటి వివరాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. దీంతో పాటు 42 ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, టీజీపీఏ, టీజీ నాబ్, నార్కొటిక్స్, టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో 70 బృందాలను ఏర్పాటు చేసి డ్రగ్స్‌పై ప్రత్యేక దృష్టి సారించారు.