- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంత నియోజకవర్గంలో Minister Mallareddyకి బిగ్ షాక్ (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి మల్లారెడ్డికి మరోసారి నిరసన సెగ తగిలింది. సొంత నియోజకవర్గంలో స్టేజీపై మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో మంత్రి తన స్పీచ్‌ను మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేడ్చల్ జిల్లా రాంపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తనదైన శైలిలో ఎప్పటిలానే కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో దళితులకు ఏ పార్టీ నాయకుడు ఏం చేయలేదని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం దళితుల కోసం దళితబంధు స్కీంతో పాటు స్కూళ్లు ఇతర అనేక పథకాలు ప్రవేశ పెట్టాలని చెప్పారు. దీంతో మంత్రి స్పీచ్‌పై స్టేజీపై ఉన్న ఇతర పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబేద్కర్‌కు బదులు కేసీఆర్ గురించి మాట్లాడాటాన్ని నాయకులు తప్పుపట్టారు. ఇది పార్టీ మీటింగ్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దళితులను మోసం చేశాడని మండిపడ్డారు. అయితే అకస్మత్తుగా మంత్రి స్పీచ్‌ను నేతలు అడ్డుకోవడంతో కార్యక్రమం రసాభాసగా మారింది. దాంతో మల్లారెడ్డి తన ప్రసంగాన్ని అక్కడితో ఆపేసి స్టేజీ దిగి వెళ్లిపోయారు. కాగా మల్లారెడ్డికి ఇటీవల ఇటువంటి పరిణామాలు తరచూ ఎదురవుతున్నాయి. గతేడాది సొంత జిల్లా మేడ్చల్ లో జరిగిన రెడ్డి సింహ గర్జన సభలోనూ మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. ఈ సభలోనూ సీఎం కేసీఆర్ ను కీర్తిస్తూ మల్లారెడ్డి మాట్లాడటంపై సభకు వచ్చిన కార్యకర్తలు వ్యతిరేకించారు. ఈ క్రమంలో మల్లారెడ్డిపై దాడికి ప్రయత్నించడం అప్పట్లో సంచలనం అయింది.