MLA Ailaiah: రాష్ట్రంలో సుభిక్ష పాలన: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

by Mahesh |
MLA Ailaiah: రాష్ట్రంలో సుభిక్ష పాలన: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సుభిక్షమైన పాలన అందిస్తున్నామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. రుణమాఫీ చేయడంతో రైతుల కుటుంబాల్లో పండుగ నెలకొందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. పేదలకు, రైతులకు మేలు చేసే ఈ ప్రభుత్వానికి లక్ష్మీ నరసింహ‌స్వామి ఆశీస్సులు ఉంటాయని వెల్లడించారు. రాహుల్ గాంధీ వరంగల్ లో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశారన్నారు. రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసినందుకు సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపారు. దీంతో పాటు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.

15 ఆగస్టు వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ప్రతిపక్షాలకు ఎలాంటి అనుమానం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతిపక్షాలు సహేతుమైన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ప్రతీది రాజకీయం చేసి విమర్శలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాధ్యతతో వ్యవహరిస్తోందన్నారు. ప్రజాపాలనలో పేదోళ్లకు న్యాయం జరగాలనేది తమ లక్ష్యం అన్నారు. గత పదేళ్లు పేదోడి పొట్ట కొట్టి పెద్దోళ్లకు(కార్పొరేట్) పెద్ద పీట వేశారన్నారు. కానీ తాము అలా వ్యవహరించ బోమని ప్రకటించారు.

Advertisement

Next Story