Kunamneni: వాళ్లసలు ఎమ్మెల్యేలా.. వీధి రౌడీలా! కూనంనేని సంచలన వ్యాఖ్యలు

by Shiva |
Kunamneni: వాళ్లసలు ఎమ్మెల్యేలా.. వీధి రౌడీలా! కూనంనేని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మధ్య పొలిటికల్ వార్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. తాజా పరిణామాలపై కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఘాటుగా స్పందించారు. వాళ్లసలు ఎమ్మెల్యేలా.. వీధి రౌడీలా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పనే కాంగ్రెస్ పార్టీ చేస్తోందని ఆరోపించారు. కౌశిక్‌రెడ్డి కూడా పార్టీ మారిన వాడే కదా.. అని ప్రశ్నించారు. పార్టీ మారిన వెంటనే ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడితేనే భవిష్యత్తులో ఫిరాయింపులు ఆగిపోతాయంటూ అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed