- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Nimmala:గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖ నిర్వీర్యం.. మంత్రి నిమ్మల ఫైర్!
దిశ,వెబ్‌డెస్క్: గత ప్రభుత్వ హయాంలో జలవనరుల శాఖ(Irrigation Department) నిర్వీర్యమైందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) మండిపడ్డారు. వైఎస్ జగన్(YS Jagan) పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల (irrigation projects) గేట్లు, షట్టర్లు , రోప్స్‌కు గ్రీజు వంటి వాటికి మరమ్మతులు లేకపోగా.. కనీసం గ్రీజు వంటి నిర్వహణ కూడా లేకుండా పోయిందన్నారు. ఈ క్రమంలో ఇరిగేషన్ శాఖ(Irrigation Department) పూర్తిగా నిర్వీర్యమైందని మంత్రి నిమ్మల విమర్శలు గుప్పించారు. విజయవాడ(Vijayawada) ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో(Camp Office) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల సీఈ, ఎస్ఈలతో నేడు(శుక్రవారం) మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్ట్‌లలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు వెంటనే టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల ఆపరేషన్, నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం(Every Year) రూ.983 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా.. గత వైసీపీ ప్రభుత్వం(YCP Government) ఐదేళ్లలో కేవలం రూ.275 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులు , రిజర్వాయర్లు(Reservoirs), కాలువల అత్యవసర పనుల నిర్వహణకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) విడుదల చేసిన రూ. 284 కోట్లతో వెంటనే పనులు చేపట్టాలని మంత్రి నిమ్మల ఆదేశించారు.