ఇంత అవమానమా.. కాంగ్రెస్ సర్కార్‌పై KTR సంచలన ట్వీట్

by Sathputhe Rajesh |
ఇంత అవమానమా.. కాంగ్రెస్ సర్కార్‌పై KTR సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సర్కారు తెలంగాణ రాష్ర చిహ్నాన్ని మార్చేందుకు సమాయత్తం అవుతోంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు లోగో ఆవిష్కరించేలా చకచక అడుగులు వేస్తోంది. కాగా, రాష్ట్ర చిహ్నంలో ఉన్న కాకతీయ కళా తోరణం, చార్మినార్ సింబల్స్‌ను తొలగించడం సరికాదని మొదటి నుంచి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇక, తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ఇదే అంశంపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కారుపై ఘాటుగా స్పందించారు.

‘కొన్ని శతాబ్ధాలుగా హైదరాబాద్ ఐకాన్‌గా చార్మినార్ కొనసాగుతూ వస్తోంది. హైదరాబాద్ గురించి తలచుకుంటే యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన చార్మినార్‌ని తలచుకోక తప్పదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన కారణాలను చూపుతూ ఐకానిక్ చార్మినార్‌ను రాష్ట్ర లోగో నుండి తొలగించాలని కోరుతోంది ఎంత అవమానం!! అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు చార్మినార్ ఫొటోలను జత చేశారు.

Advertisement

Next Story

Most Viewed