- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన పిలుపు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పైన ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో రేవంత్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందని.. ఆ కనీస సొయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావంటూ, ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ.. జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం తన స్థాయి మరిచి చేసిన వ్యాఖ్యలను అందరూ ఖండించాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
సుదీర్ఘ కాలం పాటు ప్రజల మన్ననలు అందుకుంటూ కార్యకర్తల ఆశీర్వాదంతో, అనేక త్యాగాలతో ప్రజలకు సేవ చేస్తున్న ఇద్దరు సీనియర్ మహిళా సభ్యులపైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డల మనసులు నొప్పించాయని అన్నారు. జీవితంలో ఎదగాలి, రాణించాలని అనుకుంటున్న ప్రతి ఒక్క మహిళకు ఈ వ్యాఖ్యలు అవమానకరమని కేటీఆర్ అన్నారు. కేవలం అధికార అహంకారంతోనే రేవంత్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేశారని అన్నారు. వెంటనే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు రేవంత్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.