- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామారెడ్డిలో ఎవరొచ్చినా గంప కింద కమ్ముడే.. KTR ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డిలో పోటీకి ఎవరొచ్చినా గంప కింద కమ్ముడే అని మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ బిడ్డలపై రేవంత్ రెడ్డి రైఫిల్ పెట్టిండన్నారు. కేసీఆర్ కామారెడ్డికి ఎందుకు వెళ్తున్నారన్న చర్చ నడుస్తోందన్నారు. కామారెడ్డిలో ఈ నెల 9న కేసీఆర్ నామినేషన్ వేస్తారన్నారు. కేసీఆర్ నామినేషన్‌కి ఇంటికొకరు తరలిరావాలన్నారు. కేసీఆర్ వస్తున్నారంటే కామారెడ్డి దశ తిరిగిపోతుంది.
బీజేపీ ఇచ్చే చాక్లెట్లు కావాలి? కేసీఆర్ ఇచ్చే ధమ్ బిర్యానీ కావాలా? అన్నారు. డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం కారుకే వేయండన్నారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని, రీడర్ అన్నారు. విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఆంధ్రా-తెలంగాణకు ఇష్టం లేని పెళ్లి చేశారన్నారు. ఆ తప్పు నుంచి బయటపడేందుకు 58 ఏళ్లు సమయం పట్టిందన్నారు. దేశంలో ఎమర్జెన్సీ పెట్టిందే నియంత ఇందిరాగాంధీ అన్నారు. ఢిల్లీ దొరలతో పోరాటం తెలంగాణకు కొత్త కాదన్నారు.