KTR: ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి

by Gantepaka Srikanth |
KTR: ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీల ఓట్ల కోసమే కులగణన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కొత్త రాజకీయానికి తెరతీసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వే కోసం వచ్చిన అధికారులు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా?, టీవీ ఉందా? అని అడగటం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నల కారణంగానే కులగణన కోసం ఇళ్లకు వెళ్తున్న అధికారులను ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులను బలిపశువులను చేస్తున్నారని మండిపడ్డారు.

జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) అంటున్నారు. 42శాతం రిజర్వేషన్లను బీసీలకు ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. యూపీఏ హయాంలో కనీసం OBC మంత్రిత్వ శాఖ కూడా పెట్టలేదని గుర్తుచేశారు. ఏడాది కిందట ఇదే రోజు కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌(BC Declaration) ప్రకటించిందని.. ఇది మాటల ప్రభుత్వమని విమర్శలు చేశారు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అడిగారు.

Advertisement

Next Story

Most Viewed