- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : మీపై ఇప్పుడు ఏ కమిషన్ వెయ్యాలి.. సీతారామ ప్రాజెక్టు టెండర్లపై కేటీఆర్ ఆరోపణలు
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రాజెక్టు పూర్తి అయ్యి కోటి ఏకరాలకు జీవం పోస్తున్న కాళేశ్వరంపై కమిషన్‌లు వేసి విచారణ చేస్తున్న మీపై ఇప్పుడు ఏ కమిషన్ వెయ్యాలని మాజీ మంత్రి KTR కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా ఢిల్లీ నేస్తం - అవినీతి హస్తం అంటూ ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘అంచనాలను పెంచారని హాహాకారాలు చేసినోళ్లు, అవినీతి జరిగిందని బురదజల్లిన వాళ్లు, కాళేశ్వరం మీద కక్షగట్టిన రైతుల పొట్టగొట్టినవాళ్లు, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్ళి వలసలకు పచ్చజెండా ఉపినవాళ్లు, తెలంగాణ ప్రాజెక్టుల మీద విషం కక్కి రాష్ట్రాన్ని ఆగంపట్టించినవాళ్లు, ప్రజాపాలన అని పొద్దుకు పదిమార్లు ప్రగల్భాలు పలికెటోళ్లు, Sitarama project సీతారామ ఎత్తిపోతల పథకంలో అనుమతులు లేకుండానే రూ.1074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలిచారు’ అని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సుద్దపూస ముచ్చట్లు చెప్పే మీరు ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీల పనుల్లో నిబంధనలు ఎలా తుంగలో తొక్కారని ఆరోపించారు. ఒక మీటింగ్‌లో త్వరగా టెండర్లు పిలవాలి అని ఆదేశం, మరో మీటింగ్‌లో ఇదేంటి అంటూ నంగనాచి మాటలు చెప్పారని విమర్శించారు.