- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: 'సొంత ట్రాప్ లో కేటీఆర్' బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్వీట్ పై టీ కాంగ్రెస్ కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ రంగం కుదేలైందని, ఐటీ ఎగుమతులు, ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రగతి క్షీణించిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ పై తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. నిన్న కేటీఆర్ చేసిన ట్వీట్ కు బదులుగా బుధవారం కాంగ్రెస్ తన అఫీషియల్ ఎక్స్ ట్విట్టర్ ఖాతా నుంచి రియాక్ట్ అవుతూ.. మన రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ను నిర్మించుకోవడంపై ఎలాంటి నిర్మాణాత్మక ఆలోచనలైనా తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూనే.. కేటీఆర్ చూపించిన లెక్కలు చూస్తుంటే మీరు మీ స్వంత ఉచ్చులో చిక్కుకున్నట్టు కనిపిస్తున్నదని సెటైర్ వేసింది. మీరు ప్రస్తావించిన డేటా 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినదని ఈ కాలంలో, మొదటి 3 త్రైమాసికాల్లో (8 నెలల కంటే కొంచెం ఎక్కువ) బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ తర్వాత 2023 డిసెంబర్ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ లెక్కలు కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నది. అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎగుమతులు పడిపోయాయని మీరు ఒప్పుకోవాలనుకుంటున్నారా? అని ప్రశ్నించింది.
ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారు:
2023 - 24 గణాంకాల ద్వారా, మేము రాజకీయ ఉద్దేశ్యం లేకుండా గణాంకాల పరంగా రాష్ట్ర ప్రతిష్టను పెంచడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. కానీ మీరు ప్రతిదానిని రాజకీయం చేయాలనుకుంటున్నారని దుయ్యబట్టింది. రాష్ట్రంలో ఐటీ వృద్ధి భౌగోళిక రాజకీయ అంశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉందని అర్థం చేసుకోవాలని సూచించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2004 - 2014 పదేళ్ల కాలంలో ఐటీ పరిశ్రమ ఎలా అభివృద్ధి చెందిందన్న దానికి ప్రతిబింబంగా రాష్ట్రంలో మొత్తం ఐటీ ఉద్యోగాలు 85,945 నుంచి 3,23,396కు పెరిగాయని, ఐటీ ఎగుమతులు పెరిగాయని, ఆ కాలంలో సాఫ్ట్‌వేర్ ఎగుమతులు 10 X పెరగడాన్ని మీరు చూడవచ్చని పేర్కొంది. అదేవిధంగా 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో రెండున్నర లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. గూగుల్, అమెజాన్ వంటి అనేక మార్క్యూ కంపెనీలు కాంగ్రెస్ సమయంలో హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించాయని గుర్తు చేసింది. తెలంగాణలో ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, ప్రతిభ లభ్యత, స్థిరమైన ప్రభుత్వాల కారణంగా గవర్నమెంట్ తో సంబంధం లేకుండా ఐటీ రంగం అభివృద్ధి చెందుతూనే ఉంది తప్ప క్రెడిట్ ఎవరికి దక్కుతుందనేది కాదని స్పష్టం చేసింది. గ్లోబల్ కారకాల వల్ల మందగమనం సంభవించే కాలాలు ఉంటాయని, ఐటీ రంగం పుంజుకుంటున్నదని ఈ విషయంలో వెర్రి రాజకీయాలు లేకుండా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని తెలిపింది.
Read Allso: విలీనమా.. పొత్తు కోసమా..!.. బీజేపీతో బీఆర్ఎస్ రహస్య మంతనాలు?