KTR: ఏసీబీ విచారణకు కేటీఆర్ హజరయ్యేనా..?

by Ramesh Goud |   ( Updated:2025-01-05 17:09:46.0  )
KTR: ఏసీబీ విచారణకు కేటీఆర్ హజరయ్యేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హజరవ్వాలని మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ అధికారులు నోటీసులు అందజేశారు. నేటీ నుండి విచారించనున్నారు. ఈ నేపధ్యంలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏ1 గా ఉన్నా కేటీఆర్ విచారణకు హజరువుతారా లేదా అనే ఉత్కంఠత నెలకోంది. ఈ కేసు విషయంలో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సమయంలో విచారణ చెపట్టిన హైకోర్టు ధర్మాసనం ఏసీబీ విచారణకు సహకరించాలని ఆదేశాలిచ్చింది. అరెస్టు విషయంలో మాత్రం మినహయింపు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ విచారణకు ఖచ్చితంగా హజరుకావాల్సిందేనని సంకేతాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ విచారణ అనంతరం ఏ2గా ఉన్న సీనీయర్ ఐఎస్ అధికారి అరవింద్ కుమార్ ను 8వ తేదిన విచారించనున్నారు. తరువాత ఏ3గా ఉన్న హెచ్ఎండిఏ మాజీ ఛీఫ్ ఇంజనీర్ బిఎల్ ఎన్ రెడ్డి ని 10వ తేదిన విచారించనున్నారు. కేటీఆర్ విచారణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పిర్యాదు దారు ఎమ్ఏయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ స్టేట్మెంట్ కీలకం కానుంది. ఫార్ములా ఈ రేస్ కేసు గురించి ఇది వరకే కేటీఆర్ పలు వ్యాఖ్యాలు చేశారు. మొదట చెప్పిన దానికే కట్టుబడి ఉంటటాని పేర్కోన్నారు. మరోమారు ఇది లోట్టపీస్ కేసంటూ కూడా వ్యాఖ్యాలు చేశారు.

మొదటీ నుండే ఉత్కంఠతే..అసలు కేసు నమోదవుతుందా.. నమోదైతే కేటీఆర్ ను అరెస్టు చేస్తారా... అంటూ ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కేసు నమోదు నాటి ఉత్కంఠత సాగుతూనే ఉంది. ఎమ్ఏయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ పిర్యాదుతో కేసు బయటకు వచ్చింది. నాటి నుండి అసలు కేసు నమోదు అవుతుందా. గవర్నర్ అనుమతి వస్తుందా అని వస్తే ఎప్పటి వరకు వస్తుంది అనే ఉత్కంఠత సాగింది. డిసెంబర్ 17వ తేదిన గవర్నర్ అనుమతులు లభించాయి. అనంతరం డిసెంబర్ 18వ తేదిన కేసు నమోదుకు గవర్నర్ అమోదం లభించిందని సీఎస్ ఏసీబీ అధికారులకు ఆదేశాలిచ్చారు. 19వ తేది సాయత్రం 5.30గంటల సమయంలో ఏసీబీ అధికారులు ఏ1గా మాజీ మంత్రి , బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏ2 గా సీనీయర్ ఐఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా మాజీ ఛీఫ్ ఇంజనీర్ బిఎల్ ఎన్ రెడ్డి పేర్లను చేర్చారు. ఏసీబీ కేసు నమోదు చేసిన వెంటనే కేటీఆర్ అరెస్ట్ జరుగుంతుందంటూ ఉత్కంఠత చోటు చేసుకుంది. 20వ తేదీన కేటీఆర్ కోర్టును ఆశ్రయించడం మూడు పిటిషన్లలలో రెండు పిటిషన్లను హైకోర్టు తిరస్కరిచండంతో మరోమారు ఉత్కంఠత చోటు చేసుకుంది. డిసెంబర్ 30వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో కొంత ఊరట లభించింది. డిసెంబర్ 31 విచారణ తరువాత ఏ తీర్పు వెలువడుతుంది అనే ఉత్కంఠత మొదలైంది. ఇరు వాదనలు విన్న హైకోర్టు జస్టీస్ లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పు వెలువడే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలిచ్చింది. ఏ2,ఏ3 లను ఎందుకు అరెస్టు చేయలేదు, ఆధారాలు ఏ సేకరించారు అని హైకోర్టు ఏసీబీ అధికారలను ప్రశ్నిచడంతో మళ్ళీ ఉత్కంఠత మొదలైంది. ఈ నేపధ్యంలో ఏసీబీ అధికారులు జనవరి 6 వ తేదిన విచారణకు హజరు కావాలని ఏ1గా ఉన్న కేటీఆర్ కు నోటీసులు అందజేశారు. నేడు కేటీఆర్ హజరవుతారా.. లేదా అనే ఉత్కంఠత మరోమారు నెలకొంది. ఏసీబీ విచారణ అనంతరంమంగళవారం ఈడి విచారణను కేటీఆర్ ఏదుర్కోనాల్సి ఉంది.

Advertisement

Next Story