- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Konda Surekha: చెల్లె జైల్లో ఉన్నప్పుడే కేటీఆర్ హ్యాపీగా ఉన్నాడు: కొండా సురేఖ
దిశ, డైనమిక్ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్‌ది థర్డ్ ప్లేస్ అని, అందుకే ఆయన మానసికంగా ఆందోళన చెందుతున్నారని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత (Kavitha) జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ హ్యాపీగా ఉన్నాడని, చెల్లి జైలు నుంచి బయటకు రావడంతో ఇప్పుడు రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయని అన్నారు. ఇవాళ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్‌రావు (Harish Rao), కవిత ఒక్కటి కాబోతున్నారనే టాక్ వినిపిస్తోందని, కేటీఆర్ చేస్తున్న పనులకు బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట దిగజారిపోతుందని దీంతో కేసీఆర్ సైతం కవితకు ప్రముఖ స్థానం ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతున్నదని అన్నారు.
ఫుడ్ పాయిజన్ వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ హస్తం..
హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనల్లో (Food Poisoning Incidents) కుట్ర కోణం దాగిఉందని, దీని వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (R.S Praveen Kumar) హస్తం ఉందని మంత్రి ఆరోపించారు. ఆయన గతంలో గురుకులాల కార్యదర్శిగా పని చేశారని తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని అన్నారు. దళిత ఓటర్లను మళ్లించేందుకు ఆయనను ఓ పావుగా కేసీఆర్ వాడుకున్నారని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హాస్టల్ భోజనాల్లో పురుగులే కాదు కప్పలు కూడా వచ్చాయన్నారు. సంక్షేమ హాస్టళ్లను ఏనాడూ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రతి ఘటనపై విచారణ చేస్తామని, దోషులెవరో తేల్చుతామని మంత్రి స్పష్టం చేశారు.
సైకోరామ్.. ఇంకా సిగ్గురాలేదా?..
ప్రణాళికబద్ధంగా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు బీఆర్ఎస్ (BRS) ప్రయత్నాలు చేస్తున్నదని కొండా సురేఖ ఆరోపించారు. లగచర్లలో కలెక్టర్ మర్డర్‌కు ప్లాన్ చేశారని, తెలంగాణకు పరిశ్రమలు రాకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్ల కలెక్టర్‌ను కేటీఆర్ (KTR) ఇష్టం ఉన్నట్లు తిట్టారని, ‘ప్రజలు ఛీ అని తిరస్కరించినా సైకో రామ్ మీకు ఇంకా సిగ్గురాలేదా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేసిన తప్పులకు జైలుకు వెళ్లడం ఖాయమని కేటీఆర్‌కు అర్థం అయిందని, అసలు విషయం ఒప్పుకోకుండా మూసీ, గిరిజనులను అడ్డం పెట్టుకుని జైలుకు పోయే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. తానేదో స్వతంత్ర సమరయోధుడిలా ప్రజల కోసం జైలుకు వెళ్తానని పదే పదే మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
Read More :
Konda Surekha: గురుకులాల్లో కుట్రల వెనుక RS ప్రవీణ్ కుమార్.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
RS Praveen Kumar: బీర్లు, బిర్యానీ, రేవ్ పార్టీలే మీకు తెలుసు.. మంత్రి వ్యాఖ్యలపై ఆర్ఎస్పీ ఫైర్