KTR: అధికారంలోకి వచ్చాక ఏం చేయాలో మాకు తెలుసు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-15 17:14:52.0  )
KTR: అధికారంలోకి వచ్చాక ఏం చేయాలో మాకు తెలుసు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్‌ కలెక్టర్‌(Vikarabad Collector)పై దాడి ఘటనలో అరెస్టై జైల్లో ఉన్న రైతులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భేషరతుగా రైతులపై పెట్టిన కేసులను ప్రభుత్వం విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ప్రకటించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. ఢిల్లీ బాసులు మారిస్తే మారే సీటు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ది అని అన్నారు. రేపు తాము తప్పకుండా అధికారంలోకి వస్తామని.. వచ్చాక ఏం చేయాలో తమకు తెలుసని ధీమా వ్యక్తం చేశారు.

జైల్లో ఉన్న రైతుల ఉసురు కాంగ్రెస్‌కు తప్పకుండా తగులుతుందని అన్నారు. వారికి బెయిల్ కోసం తాము న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. లగచర్లలో కలెక్టర్‌పై దాడి జరిగాక బీఆర్‌ఎస్ నాయకులను అరెస్ట్ చేసి కాంగ్రెస్ వాళ్ళని వదిలేశారని పేర్కొన్నారు. హైదరాబాద్ శివార్లలో ఫార్మాసిటీ కేసీఆర్ పెడితే రేవంత్ వాళ్ల కుటుంబ సభ్యుల కోసం మార్చారని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. తిరుపతి రెడ్డి బెదిరింపులకు ఎవరూ భయపడేవాడు లేరని స్పష్టం చేశారు. అవసరం అయితే సుప్రీంకోర్టుకి వెళతామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed