- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విదేశాల్లో ఉండటం వల్ల రాలేకపోయా.. MLA లాస్య మృతిపై KTR ఎమోషనల్
దిశ, వెబ్‌డెస్క్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిద్దిపేట ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు. ఆదివారం ఉదయం స్వయంగా లాస్య ఇంటికి వెళ్లి కుటుంసభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం లాస్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలోలాస్య మృతిచెందిన విషయం తెలిసి చాలా బాధపడ్డానని అన్నారు.
విదేశాల్లో ఉండటం మూలంగా విషయం తెలిసిన వెంటనే రాలేకపోయానని ఆవేదన చెందారు. 10 రోజులుగా లాస్యను అనేక ప్రమాదాలు వెంటాడుతున్నాయని అన్నారు. లాస్య కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా, రెండ్రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిచెందారు. హైదరాబాద్ ORR పై జరిగిన ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయలు అయ్యాయి.