- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : పట్నం నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
దిశ, వెబ్ డెస్క్ : లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటన నేపథ్యంలో కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narendra Reddy)ని ప్రభుత్వం అరెస్టు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR ) పట్నం నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి భరోసా కల్పి్ంచారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జి.జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
అంతకుముందు పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ కేబీఆర్ పార్కు వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనకు ఆయన కుట్ర పన్నారన్న కోణంతో పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారంటూ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఫార్మా కంపనీకి వ్యతిరేకంగా రైతులు, గ్రామస్తులు అధికారులపై తిరగబడితే ప్రభుత్వం మాత్రం ప్రజావ్యతిరేకతను పట్టించుకోకుండా రాజకీయ కక్షతో పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేసిందని కేటీఆర్ తప్పుబట్టారు.