పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్.. ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ!

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-14 10:47:27.0  )
పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్.. ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు న్యాయం జరగడం లేదని శుక్రవారం మాజీ పీసీసీ చీఫ్, ఎక్స్ మినిస్టర్ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను పొన్నాల ఖర్గేకు పంపారు. ఇక తాజాగా శనివారం మంత్రి కేటీఆర్ పొన్నాల ఇంటికి వెళ్లారు. ఇక సీనియర్ లీడర్ పొన్నాల సేవలను వినియోగించుకోవాలని ఫిక్స్ అయిన బీఆర్ఎస్ అలర్ట్ అయింది. అందులో భాగంగానే మంత్రి కేటీఆర్ పొన్నాల ఇంటికి వెళ్లి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ అనంతరం పొన్నాల బీఆర్ఎస్ లో చేరుతారా..? చేరితే ఆయనకు పోటీ చేసే ఛాన్స్ గులాబీ పార్టీ ఇస్తుందా..? లేక నామినేటెడ్ పదవి కట్టబెడుతుందా అన్నది పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక పార్టీ మారిన పొన్నాలపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పదవులను అనుభవించి పార్టీని వీడారని మండిపడ్డారు.

Advertisement

Next Story