- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసిన సర్కార్: మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: రుణమాఫీ పేరిట మరోసారి రాష్ట్ర రైతులను రేవంత్ సర్కార్ మోసం చేస్తున్నదని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గురువారం ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రైతుబంధు కింద జూన్ లో ఇవ్వాల్సిన నిధులలోంచే రూ.7000 కోట్లు రుణమాఫీకి దారిమళ్లించారని ఆరోపించారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుండి కొంతమొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నమని పోజులు కొడుతున్నారని విమర్శించారు. 40 లక్షల పైచిలుకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. 2014, 2018లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హతనా అంటూ నిలదీశారు. 2014లోనే కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ.16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ధి చేకూర్చిందన్నారు. 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ.19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్దిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు అన్నారు. కాంగ్రెస్ మానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు అన్ని వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులందరి రైతులకూ రైతుబంధు విడుదల చేయాలన్నారు.
పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి
పోలీస్ సిబ్బందికి ప్రజలతో వ్యవహరించే విషయంలో ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని డీజీపీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. పోలీసుల వ్యవహార శైలి పైన ట్విట్టర్ వేదికగా డీజీపీని మరోసారి ప్రశ్నించారు. పోలీసులు వాహనదారుడిపైన దుర్భాషలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్రంగా స్పందించారు. వినరాని భాషలో పోలీస్ సిబ్బంది సాధారణ పౌరుడిని దుర్భాషలాడడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పోలీస్ శాఖకు, డీజీపీకి అంగీకారయోగ్యమైన బాషేనా అని ప్రశ్నించారు. పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ మధ్యకాలంలో పోలీసులు ప్రజలతో ప్రవర్తిస్తున్న తీరు చాలాసార్లు తమ దృష్టికి వచ్చిందని, పదుల సంఖ్యలో సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వస్తున్న పోలీసులు స్పందించడం లేదని మండిపడ్డారు.
మెడికల్ డివైజెస్ పార్క్ నుంచి ఉత్పత్తి ప్రారంభం సంతోషం
హైదరాబాద్‌ను లైఫ్ సెన్స్ రంగం, మెడికల్ ఎక్విప్ మెంట్ల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న కృతనిశ్చయంతో కేసీఆర్ హైదరాబాద్‌లోని సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్క్‌ను ఏర్పాటు చేశారని కేటీఆర్ అన్నారు. ఆ పార్క్‌లో ఏర్పాటైన సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లో మొట్టమొదటి సారిగా స్టెంట్లను ఉత్పత్తి చేశారని గుర్తు చేశారు. ఆ సంస్థకు సంబంధించిన స్టెంట్లు నేటి నుంచి మార్కెట్లోకి రానుండటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే ప్రొడక్ట్స్ దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్‌పోర్ట్ కానుండటం ఎంతో గర్వంగా ఉందన్నారు. సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన మెడికల్ డివైజెస్ పార్క్ రాష్ట్రానికి భవిష్యత్తులో ఎంతో సంపద సృష్టించే వనరని అన్నారు.