- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RS ప్రవీణ్ కుమార్‌పై KTR ప్రశంసల వర్షం.. ధీరుడు, వీరుడు అంటూ పొగడ్తలు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. మంగళవారం అలాంపూర్‌లో నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీని ఒక్కొక్కరుగా వదిలిపెడుతోన్న సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం పార్టీని వీడలేదన్నారు. ప్రవీణ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానించిందని, ఇంతముందు నిరంజన్ రెడ్డి పనిచేసిన ప్లానింగ్ బోర్డ్ వైస్ చెర్మైన్ పదవి ఇస్తామని, కేబినెట్ ర్యాంక్ ఇస్తాం మీరు పార్టీలోకి రావాలని ప్రవీణ్‌ను కాంగ్రెస్ పార్టీ అడిగింది. కానీ ప్రవీణ్ కుమార్ నిర్మోహమాటంగా ముఖం మీదనే నేను రానని చెప్పారు.
మీరు ఐపీఎస్ ఆఫీసర్‌గా పని చేశారు.. పరిపాలన అనుభవం ఉంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెర్మైన్ పదవి తీసుకొండని కాంగ్రెస్ మరో ఆహ్వానం పంపింది. అయినా కూడా ఆయన నిరాకరించారు. చివరకు మన రాష్ట్రంలో మూడు రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. (వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి) మీకు ఇష్టమైన ప్లేస్ కోరుకోండి. డబ్బులు కూడా మొత్తం మేమే పెడతాం మీరు మా పార్టీ తరపున రండని ఆహ్వానించారన్నారు. కానీ అధికార పార్టీని కాదని, వారి ప్రలోభాలను కాదని, ఇవాళ కష్టంలో ఉన్న మన నాయకుడు కేసీఆర్‌కు అండగా వచ్చిన ధీశాలి, పోరాట వీరుడు, ఒక దైవభక్తుడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.