KTR: రాహుల్ గాంధీకి లేఖ రాయబోతున్నా.. కేటీఆర్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
KTR: రాహుల్ గాంధీకి లేఖ రాయబోతున్నా.. కేటీఆర్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ భవన్‌(Telangana Bhavan).. జనతా గ్యారేజ్‌గా మారిందని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అప్పుల గురించి కాదు.. హామీల గురించి మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సూచించారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) చేసిందేమీ లేదని అన్నారు. సీఎం రేవంత్ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

నిత్యం అప్పులు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. ఏడాది పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై త్వరలో రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి లేఖ రాస్తానని ప్రకటించారు. రేవంత్ రెడ్డి బండారం మొత్తం బయటపెడతానని కీలక వ్యాఖ్యలు చేశారు. దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు ఇద్దరు తప్పా.. ఎవరూ బాగుపడలేదని వెల్లడించారు. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ కాదు.. రేవంత్ బ్రదర్ రైజింగ్ అని అన్నారు.

Advertisement

Next Story