67 మందికి 720 మార్కులా.. NDA సర్కారు కొలువుదీరనున్న వేళ కేటీఆర్ సంచలన ట్వీట్

by Rajesh |
67 మందికి 720 మార్కులా.. NDA సర్కారు కొలువుదీరనున్న వేళ కేటీఆర్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్ ఫలితాలపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ‘కొత్త ఎన్డీయే సర్కారు కొలువుదీరుతున్న వేళ వారి ముందు అనేక సవాళ్లు ఉంటాయని గట్టిగా నమ్ముతున్నాను. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ 2024 ఫలితాలు సున్నితమైన సమస్య. గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మంది విద్యార్థులు 720/720 మార్కులు సాధించారని.. వీరంతా ఏఐఆర్ 1 ర్యాంకు సాధించారని ఇదే ఇప్పుడు అనేక ప్రశ్నలకు తావిస్తోందన్నారు. కొంత మంది 718, 719 మార్కులు సాధించారని.. అయితే +4, -1 మార్కింగ్ స్కీమ్ ఉన్న పరీక్షలో ఇదేలా సాధ్యమన్నారు.

ఇదే విషయమై ఎన్డీఏ విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చామని తెలిపిందని గుర్తు చేశారు. అయితే వీరిలో కొంత మంది.. +100 గ్రేస్ మార్కులు పొందారని తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజు రిజల్ట్ వెల్లడి అయ్యాయని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో తొలిసారిగా టాప్ 5 లో తెలంగాణ విద్యార్థులు లేరని.. అందుకే తమకు ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని అనుమానాలు ఉన్నాయని తెలిపారు. గ్రేస్ మార్కుల కోసం అనుసరించిన ప్రక్రియను బహిర్గంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. 1500 మంది విద్యార్థులతో కూడిన ఎంపిక అందరికి ప్రయోజనం చేకూర్చేలా ఉండాలన్నారు. విద్యార్థులు, వారి కుటుంబాలకు ఈ అంశంలో పారదర్శకంగా దర్యాప్తు చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed