వారికి కచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: KTR సెన్సేషనల్ కామెంట్స్

by Anjali |   ( Updated:2024-07-09 10:00:26.0  )
వారికి కచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: KTR సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాదు వేదికగా తుక్కుగూడ వేదికన కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మ్యానిఫెస్టో న్యాయ్ పత్ర్ అనే పేరిట తెలంగాణలో ఆవిష్కరించారని తెలిపారు. అంటే.. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి పోతే ఆటోమేటి‌క్‌గా ఆ వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించవచ్చని కాంగ్రెస్ పార్టీ న్యాయ్ పత్ర్ చెప్పారన్నారు. ఏ తుక్కుగూడ వేదిక మీద అయితే ఈ తుక్కు మాటలు చెప్పారో అదే వేదికపై దానం నాగేందర్, తెల్లం వెంకట్ రావు, కడియం శ్రీహరిని కూర్చోబెట్టుకుని.. ఒకవైపు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు రాజ్యాంగం పట్టుకుని డ్రామా చేస్తునందుకు కచ్చితంగా రాహుల్ గాంధీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్ సెటైర్ వేశారు.

Advertisement

Next Story

Most Viewed