Iran: ఇరాన్ సుప్రీం లీడర్ ట్విట్టర్ ఖాతా రద్దు

by Mahesh Kanagandla |
Iran: ఇరాన్ సుప్రీం లీడర్ ట్విట్టర్ ఖాతా రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్(Iran) సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమెనెయి(Ayatollah Ali Khamenei) హిబ్రూ భాష(Hebrew Language)కు ఉపయోగిస్తున్న ఎక్స్(ట్విట్టర్) ఖాతా రద్దయింది. ఈ ఖాతాలో ఖమెనెయి రెండు పోస్టులు పెట్టారు. ఖమెనెయి హిబ్రూ భాష ఎక్స్ ఖాతా రద్దయినట్టు జెరూసలేం పోస్టు పేర్కొంది. ఇందులో తొలి పోస్టుగా ‘అల్లా’ను తలుస్తూ ఖమెనెయి శనివారం పోస్టు(X Post) పెట్టారు. ఆదివారం ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూ పోస్టు చేశారు. జియోనిస్టులు ఇరాన్‌ను తప్పుగా అంచనా వేసి మిస్టేక్ చేశారని తెలిపారు. ఇరాన్ దేశానికి ఉన్న శక్తి, సామర్థ్యాలు, లక్ష్యాన్ని వారికి సరిగ్గా అర్థమయ్యేలా చేస్తామని పేర్కొన్నారు. ఖమెనెయి తన మెయిన్ ఎక్స్ ఖాతాలో తరుచూ హిబ్రూ భాషలో ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతుంటారు.

అక్టోబర్ 1వ తేదీన ఇరాన్ చేసిన దాడికి ప్రతిగా శనివారం ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ దాడికి తాము ప్రతీకారం తీర్చుకున్నామని, తమ యుద్ధ విమానాలు క్షేమంగా వెనక్కి తిరిగి వచ్చాయని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ దాడులను తీవ్రతరం చేయాల్సిన పని లేదా తక్కువగా చూడాల్సిన అవసరం లేదని ఇరాన్ పేర్కొంది. అయితే, ఈ దాడులకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా తోసిపుచ్చే పని ఇరాన్ చేయదనీ పరోక్షంగా హెచ్చరించింది.

Advertisement

Next Story

Most Viewed