ANR National Award : చిరంజీవికి ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానం

by M.Rajitha |
ANR National Award : చిరంజీవికి ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏఎన్నార్ జాతీయ అవార్డు(ANR National Award 2024) నేడు టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి(Chiranjeevi) అందుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది. 2024వ ఏడాదికి గాని ఏఎన్నార్ జాతీయ అవార్డును బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amithab bachchan) చేతుల మీదుగా తెలుగు అగ్ర నటుడు చిరంజీవికి ప్రదానం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఈ అవార్డును చిరంజీవికి అందివ్వనున్నట్టు అక్కినేని నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా అవార్డు అందుకున్న చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Advertisement

Next Story